FLASH... FLASH...

·తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఖరారు 🔰హైదరాబాద్‌: తెలంగాణలో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ తుది విడత షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. కౌన్సెలింగ్ తేదీలను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్ మిత్తల్ వెల్లడించారు. 🔰కౌన్సెలింగ్‌ వివరాలు... 🔸ధ్రువపత్రాల పరిశీలనకు ఈనెల 25, 26న స్లాట్‌ బుకింగ్‌లు. 🔸ఈనెల 27న ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ధ్రువపత్రాల పరిశీలన. 🔸ఈనెల 27 నుంచి 30 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు. 🔸నవంబర్‌ 2న తుది విడత ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపు. 🔸నవంబర్‌ 9 నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌. 🔸నవంబర్‌ 9, 10న ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ వెబ్‌ ఆప్షన్లు నమోదు. 🔸నవంబర్‌ 12న ప్రత్యేక విడత సీట్ల కేటాయింపు. 🔸నవంబరు 14న స్పాట్‌ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల https://tseamcet.nic.in.

Tuesday, November 2, 2021

 ఆత్మగౌరవానికి అహంకారానికి జరిగిన పోరులో బీజేపీదే విజయం.


హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గారిని గెలిపించిన హుజురాబాద్ ప్రజానీకానికి రాష్ట్ర కిసాన్ మోర్చా అధికార ప్రతినిధి అప్పారావు గారు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు. సత్తుపల్లి నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో జరిగిన విజయోత్సవ విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ కెసిఆర్ కల్లబొల్లి మాటలను హుజురాబాద్ ప్రజానీకం విశ్వసించ లేదని, అహంకారానికి ఆత్మగౌరవానికి జరిగిన ఈ పోరులో అంతిమ విజయం బీజేపీదే అని ,ఈ విజయం కేసీఆర్ సర్కార్ కు పతనానికి నాంది కాబోతుంది అని రాబోయే ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. హుజరాబాద్ యువత మాత్రమే కాకుండా, సబ్బండ వర్గాల ప్రజలు భారతీయ జనతా పార్టీనీ, రాజేంద్ర గాని గారిని నిండు మనసుతో ఆశీర్వదించారని వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు ఎన్నికల ఫలితాలు కేసీఆర్ సార్ కు కనువిప్పు కలగాలని ఆయన అన్నారు అహంకారంతో నియంత పాలన సాగిస్తున్న కేసీఆర్ సర్కార్ కు ఈ ఫలితాలు చెంపపెట్టు అని ఇకనైనా కేసీఆర్ సార్ గారు బుద్ధి తెచ్చుకుని ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇవ్వాలని ,రైతు రుణ మాఫీ చేయాలని, దళిత బంధు పథకాన్ని రాష్ట్రమంతటా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈటెల రాజేంద్ర గారి చేసిన అభివృద్ధి ఈ విజయానికి కారణం అని దానితోపాటు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గం జాతీయ కార్యవర్గం ఎన్నికలను సవాలుగా తీసుకొని ప్రచారం చేశాయని ఆయన అన్నారు ఈ విజయం ఉద్యమకారులకు తెలంగాణ వాదులకు అంకితమని, ఉద్యమకారుల జోలికి వస్తే ఎవరికైనా ఈ గతే పడుతుందని ఈ విషయం తేటతెల్లం చేసింది అన్నారు. ఆయన అన్నారు సందర్భంగా భారతీయ జనతా పార్టీ సత్తుపల్లి నియోజకవర్గ కార్యాలయంలో మిఠాయిలు పంచుకొని శుహ సుభాష్ సర్కిల్ వద్ద టపాసులు  కాల్చారు.ఈ కార్యక్రమం లో కిసన్మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి,ఉడతనేని అప్పారావు గారు,శ్రీ కందిమల్ల కృష్ణారావు గారు,నాయుడు రాఘవరావు గారు, భాస్కర్ని వీరంరాజు గారు,sk రహెంతుల్ల,sk సుభాని, బి బాలకృష్ణ రెడ్డి గారు,,నాగసురెంద్ర రెడ్డి, ఇరపా కృష్ణ రావు,భాస్కర్ రావు గారు,శివ,వీరాస్వామి గారు,వెంకటేశ్వరరావు,పూజిత,చారి గారు,శ్రీ రాములు,కృష్ణ స్వామి,మరియు మండల పట్టణ అధ్యక్షుడు పాలకొల్లు శ్రీనివాస్,ఆచంటి నాగస్వమి



No comments:

Post a Comment