FLASH... FLASH...

·తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఖరారు 🔰హైదరాబాద్‌: తెలంగాణలో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ తుది విడత షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. కౌన్సెలింగ్ తేదీలను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్ మిత్తల్ వెల్లడించారు. 🔰కౌన్సెలింగ్‌ వివరాలు... 🔸ధ్రువపత్రాల పరిశీలనకు ఈనెల 25, 26న స్లాట్‌ బుకింగ్‌లు. 🔸ఈనెల 27న ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ధ్రువపత్రాల పరిశీలన. 🔸ఈనెల 27 నుంచి 30 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు. 🔸నవంబర్‌ 2న తుది విడత ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపు. 🔸నవంబర్‌ 9 నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌. 🔸నవంబర్‌ 9, 10న ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ వెబ్‌ ఆప్షన్లు నమోదు. 🔸నవంబర్‌ 12న ప్రత్యేక విడత సీట్ల కేటాయింపు. 🔸నవంబరు 14న స్పాట్‌ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల https://tseamcet.nic.in.

Tuesday, November 2, 2021

 ఆత్మగౌరవానికి అహంకారానికి జరిగిన పోరులో బీజేపీదే విజయం.


హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గారిని గెలిపించిన హుజురాబాద్ ప్రజానీకానికి రాష్ట్ర కిసాన్ మోర్చా అధికార ప్రతినిధి అప్పారావు గారు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు. సత్తుపల్లి నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో జరిగిన విజయోత్సవ విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ కెసిఆర్ కల్లబొల్లి మాటలను హుజురాబాద్ ప్రజానీకం విశ్వసించ లేదని, అహంకారానికి ఆత్మగౌరవానికి జరిగిన ఈ పోరులో అంతిమ విజయం బీజేపీదే అని ,ఈ విజయం కేసీఆర్ సర్కార్ కు పతనానికి నాంది కాబోతుంది అని రాబోయే ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. హుజరాబాద్ యువత మాత్రమే కాకుండా, సబ్బండ వర్గాల ప్రజలు భారతీయ జనతా పార్టీనీ, రాజేంద్ర గాని గారిని నిండు మనసుతో ఆశీర్వదించారని వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు ఎన్నికల ఫలితాలు కేసీఆర్ సార్ కు కనువిప్పు కలగాలని ఆయన అన్నారు అహంకారంతో నియంత పాలన సాగిస్తున్న కేసీఆర్ సర్కార్ కు ఈ ఫలితాలు చెంపపెట్టు అని ఇకనైనా కేసీఆర్ సార్ గారు బుద్ధి తెచ్చుకుని ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇవ్వాలని ,రైతు రుణ మాఫీ చేయాలని, దళిత బంధు పథకాన్ని రాష్ట్రమంతటా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈటెల రాజేంద్ర గారి చేసిన అభివృద్ధి ఈ విజయానికి కారణం అని దానితోపాటు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గం జాతీయ కార్యవర్గం ఎన్నికలను సవాలుగా తీసుకొని ప్రచారం చేశాయని ఆయన అన్నారు ఈ విజయం ఉద్యమకారులకు తెలంగాణ వాదులకు అంకితమని, ఉద్యమకారుల జోలికి వస్తే ఎవరికైనా ఈ గతే పడుతుందని ఈ విషయం తేటతెల్లం చేసింది అన్నారు. ఆయన అన్నారు సందర్భంగా భారతీయ జనతా పార్టీ సత్తుపల్లి నియోజకవర్గ కార్యాలయంలో మిఠాయిలు పంచుకొని శుహ సుభాష్ సర్కిల్ వద్ద టపాసులు  కాల్చారు.ఈ కార్యక్రమం లో కిసన్మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి,ఉడతనేని అప్పారావు గారు,శ్రీ కందిమల్ల కృష్ణారావు గారు,నాయుడు రాఘవరావు గారు, భాస్కర్ని వీరంరాజు గారు,sk రహెంతుల్ల,sk సుభాని, బి బాలకృష్ణ రెడ్డి గారు,,నాగసురెంద్ర రెడ్డి, ఇరపా కృష్ణ రావు,భాస్కర్ రావు గారు,శివ,వీరాస్వామి గారు,వెంకటేశ్వరరావు,పూజిత,చారి గారు,శ్రీ రాములు,కృష్ణ స్వామి,మరియు మండల పట్టణ అధ్యక్షుడు పాలకొల్లు శ్రీనివాస్,ఆచంటి నాగస్వమి



Thursday, October 28, 2021


  పొంగులేటి సీనన్న మీద అభిమానం తో ఈరోజు సత్తుపల్లి నడివీధుల్లో కిక్కిరిసిపోయిన అభిమానంతో బైక్ ర్యాలీ




పొంగులేటి శ్రీనన్న జన్మదిన వేడుకల్లో సత్తుపల్లి నియోజకవర్గ నాయకులు శ్రీ  మువ్వా విజయ్ బాబు గారు, డాక్టర్ దయానంద గారు మరియు  ఇతర ముఖ్య నాయకులతో పాటు, ఈ కార్యక్రమంలో లో పాల్గొన్న బాణోతు పద్మావతి...

 


ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రాజీవ్ నగర్ కాలనీలో పోలీస్ ల కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు.DCP LC నాయక్ ,కల్లూరు ACP  వెంకటేష్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు..ఈ తనిఖీలో  సరైన పత్రాలు లేని 43 ద్విచక్ర వాహనాలు,ఒక కార్ ని,అక్రమంగా నిల్వ ఉంచిన గుట్కా ప్యాకెట్స్ ను పోలీసులు స్వాధీనం  చేసుకున్నట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో  పోలీస్ అధికారులు,సిబ్బంది  పాల్గొన్నారు...

Saturday, October 23, 2021

 



సత్తుపల్లి మండలం లోని పాకలగుడెం పంచాయితీ లోగల సత్యనారయణ పురం గ్రామం లో కోడి పందాలు నిర్వహిస్తున్న స్థావరాలను పోలీసుల గుర్తించి   పలువురు అరెస్ట్ చేసి ద్వి చక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు

 సత్తుపల్లి పోలీస్ స్టేషన్, తేది -23.10.2021


ఖమ్మం జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ విష్ణు యస్ వారియర్ గారి ఆదేశాల మేరకు సత్తుపల్లి పట్టణంలో గల పాన్ షాప్ నిర్వాహకులకు, కల్లూరు ఏసిపి ఎన్. వెంకటేష్ గారి ఆధ్వర్యంలో సత్తుపల్లి పట్టణ ఇన్స్పెక్టర్ ఏ .రమాకాంత్ గారు  సమావేశం నిర్వహించి, పాన్ షాప్ యజమానులు ఎవరైనా నిషేధిత గుట్కా ప్యాకెట్లు, గంజాయి, మరియు మత్తు కు సంబంధించిన ఉత్పత్తులు ఏవైనా పాన్ షాప్ నిర్వాహకులు  తమ షాపు నందు ఎవరైనా అమ్మితే అట్టి వారి పై కేసులు నమోదు చేసి పీడీ యాక్ట్ పెడతామని, సత్తుపల్లి పట్టణ ఇన్స్పెక్టర్ ఏ రమాకాంత్ గారు హెచ్చరించారు. ఈ నిషేధిత గుట్కా లు తిని చాలా మంది యువకులు అనారోగ్యం పాలవుతున్నారని వారు ఆరోగ్యపరంగా మరియు ఆర్థికంగా నష్టపోతున్నారని తెలియజేసినారు

Friday, October 22, 2021




TELANGANA EMACET SCHEDULE TSEAMCET-2021

 తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఖరారు

🔰హైదరాబాద్‌: తెలంగాణలో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ తుది విడత షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. కౌన్సెలింగ్ తేదీలను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్ మిత్తల్ వెల్లడించారు.

🔰కౌన్సెలింగ్‌ వివరాలు...

🔸ధ్రువపత్రాల పరిశీలనకు ఈనెల 25, 26న స్లాట్‌ బుకింగ్‌లు.

🔸ఈనెల 27న ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ధ్రువపత్రాల పరిశీలన.

🔸ఈనెల 27 నుంచి 30 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు.

🔸నవంబర్‌ 2న తుది విడత ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపు.

🔸నవంబర్‌ 9 నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌.

🔸నవంబర్‌ 9, 10న ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ వెబ్‌ ఆప్షన్లు నమోదు.

🔸నవంబర్‌ 12న ప్రత్యేక విడత సీట్ల కేటాయింపు.

🔸నవంబరు 14న స్పాట్‌ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల

https://tseamcet.nic.in

Thursday, October 21, 2021

సత్తుపల్లి పోలీస్ స్టేషన్, తేది 21.10.2021



సత్తుపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో పోలీసు అమరవీరుల దినోత్సవ సంస్కరణ సభ సందర్భంగా సిఐ ఏ. రమాకాంత్ గారు మరియు పోలీసు సిబ్బంది అందరూ కలిసి పోలీస్ అమర వీరులకు నివాళులు అర్పించారు, కాగా సీఐ ఏ. రమాకాంత్ గారు మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల సేవలు మరువలేనివని శాంతిభద్రతలు పరిరక్షణ లో మరియు దేశ భద్రత లో ఎంతో మంది పోలీసు వీరులు ప్రాణత్యాగం చేశారని తెలియజేసినారు.

 మృతిని కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించిన మట్టా దయానంద్....

21-10-2021(గురువారం):-

*కల్లూరు మండలం-ఎర్ర బోయిన పల్లి గ్రామం-ysr కాలనీ లో నిరుపేద కుటుంబానికి చెందిన కోటా బుచ్చాలు (55) గారు అకశ్మికంగా మరణించగా వారి కుటుంబ సభ్యులను కలుసుకొని ప్రగాఢ సానుభూతి తెలియజేసి, వారి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించిన ఖమ్మం జిల్లా తెరాస నాయకులు డా,, మట్టా దయానంద్ గారు.


ఈ కార్యక్రమం లో బత్తుల రామారావు, రానా, గద్దెల నరసింహారావు, కోట శ్రీనివాస్ రావు, గొల్లమందల సుందర్ రావు, కోట అర్జున, కోట రాములు పాల్గొన్నారు...


Tuesday, October 19, 2021


 ADHAR CENTERS IN SATHUPALLI

  • New Aadhar Enrollment.
  • Aadhar Correction
  • Adhar Biometric Update.
  • Cell Number Update.
  • Date of Birth Correction in Aadar.

 

  • SRI SAI SWARNA NETZONE, OPP.BUSTAND, MUNCIPAL OFFICE BUILDING, MAIN ROAD, SATHUPALLY, KHAMMAM DISTRICT.- CELL: 9440344507.
  •  
  •  
  •  MEESEVA, OPPOSITE R&B GUEST HOUSE, MAIN ROAD, SATHUPALLI, KHAMMAM DISTRICT.
  •  
  •  
  • ANDHRA BANK, MAIN ROAD, SATHUPALLI, KHAMMAM DISTRICT.