FLASH... FLASH...

·తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఖరారు 🔰హైదరాబాద్‌: తెలంగాణలో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ తుది విడత షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. కౌన్సెలింగ్ తేదీలను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్ మిత్తల్ వెల్లడించారు. 🔰కౌన్సెలింగ్‌ వివరాలు... 🔸ధ్రువపత్రాల పరిశీలనకు ఈనెల 25, 26న స్లాట్‌ బుకింగ్‌లు. 🔸ఈనెల 27న ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ధ్రువపత్రాల పరిశీలన. 🔸ఈనెల 27 నుంచి 30 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు. 🔸నవంబర్‌ 2న తుది విడత ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపు. 🔸నవంబర్‌ 9 నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌. 🔸నవంబర్‌ 9, 10న ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ వెబ్‌ ఆప్షన్లు నమోదు. 🔸నవంబర్‌ 12న ప్రత్యేక విడత సీట్ల కేటాయింపు. 🔸నవంబరు 14న స్పాట్‌ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల https://tseamcet.nic.in.

Saturday, October 23, 2021

 సత్తుపల్లి పోలీస్ స్టేషన్, తేది -23.10.2021


ఖమ్మం జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ విష్ణు యస్ వారియర్ గారి ఆదేశాల మేరకు సత్తుపల్లి పట్టణంలో గల పాన్ షాప్ నిర్వాహకులకు, కల్లూరు ఏసిపి ఎన్. వెంకటేష్ గారి ఆధ్వర్యంలో సత్తుపల్లి పట్టణ ఇన్స్పెక్టర్ ఏ .రమాకాంత్ గారు  సమావేశం నిర్వహించి, పాన్ షాప్ యజమానులు ఎవరైనా నిషేధిత గుట్కా ప్యాకెట్లు, గంజాయి, మరియు మత్తు కు సంబంధించిన ఉత్పత్తులు ఏవైనా పాన్ షాప్ నిర్వాహకులు  తమ షాపు నందు ఎవరైనా అమ్మితే అట్టి వారి పై కేసులు నమోదు చేసి పీడీ యాక్ట్ పెడతామని, సత్తుపల్లి పట్టణ ఇన్స్పెక్టర్ ఏ రమాకాంత్ గారు హెచ్చరించారు. ఈ నిషేధిత గుట్కా లు తిని చాలా మంది యువకులు అనారోగ్యం పాలవుతున్నారని వారు ఆరోగ్యపరంగా మరియు ఆర్థికంగా నష్టపోతున్నారని తెలియజేసినారు

No comments:

Post a Comment